కశ్మీర్లో మరిన్ని దాడులు చేస్తాం: ఐఎస్‌కేపీ హెచ్చరిక 

19 Oct, 2021 06:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరిగిన లక్షిత దాడుల వంటివే మరికొన్ని చేపడతామంటూ జమ్మూకశ్మీర్‌ ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌(ఐఎస్‌కేపీ) హెచ్చరికలు పంపింది. తన అధికార ఆన్‌లైన్‌ పత్రిక ‘వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’లో సోమవారం ఒక ఫొటోను ప్రచురించింది.

చిరు వ్యాపారిని వెనుక నుంచి తుపాకీతో కాలుస్తున్నట్లున్న ఆ ఫొటోకు ‘మేం వస్తున్నాం(వుయ్‌ ఆర్‌ కమింగ్‌)’అంటూ శీర్షిక పెట్టింది. త్రిశూలంతో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోను కూడా ప్రచురించింది. తమ తదుపరి లక్ష్యం వారేనంటూ పరోక్షంగా హెచ్చరించింది. పండుగ సీజన్‌లో పేలుళ్లకు పథకం వేసిన ఉగ్రవాదులను ఇటీవల భద్రతా బలగాలు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐఎస్‌కేపీ స్లీపర్‌ సెల్స్‌ కశ్మీర్‌ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. 

మరిన్ని వార్తలు