ఆదిత్య –ఎల్‌1 కక్ష్య దూరం మళ్లీ పెంపు

16 Sep, 2023 05:31 IST|Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్‌1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇస్ట్రాక్‌), మారిషస్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పోర్టుబ్లెయిర్‌ గ్రౌండ్‌స్టేషన్ల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు.

మూడో విడతలో 296గీ71,767 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో నాలుగో విడుతలో భూమికి దగ్గరగా ఉన్న 296 కిలోమీటర్ల దూరాన్ని 256 కిలోమీటర్లకు తగ్గిస్తూ భూమికి దూరంగా ఉన్న 71,767 దూరాన్ని 1,21,973 కిలోమీటర్లకు పెంచారు. ఈనెల 19న అయిదోసారి కక్ష్యదూరం పెంపుదలలో భాగంగా ఆదిత్య –ఎల్‌1 ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యనుంచి సూర్యుడికి దగ్గరగా లాంగ్రేజియన్‌ పాయింట్‌–1 వద్ద çహాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు