వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే.. 

7 Sep, 2022 07:03 IST|Sakshi

వదంతులను నమ్మొద్దు 

జయలలిత మేన కోడలు దీప వ్యాఖ్య

సాక్షి, చెన్నై: పోయేస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలోకి మరికొద్ది రోజుల్లో గృహప్రవేశం చేయనున్నట్లు దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తెలిపారు. ఆ భవనాన్ని తాము విక్రయించే ప్రసక్తే లేదని, ఇది తమ పూర్వీకుల ఆస్తి, వారి జ్ఞాపకం అని స్పష్టం చేశారు. దివంగత సీఎం జయలలితకు పోయేస్‌గార్డెన్‌లో వేద నిలయం పేరిట భవనం ఉ న్న విషయం తెలిసిందే. ఆమె మరణించే వరకు అదే భవనంలోనే జీవించారు.

ఈ భవనాన్ని గత అన్నా డీఎంకే ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చే ప్రయత్నం చేసి భంగ పడింది. కోర్టులో న్యాయ పో రాటం ద్వారా ఆ భవనాన్ని జయలలిత మేన కోడ లు దీప, మేనల్లుడు దీపక్‌ సొంతం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భవనం పర్యవేక్షణ, తదితర వ్యవ హారాలు దీప, దీపక్‌కు భారమైనట్టు ప్రచారం జోరందుకుంది. అలాగే ఆ భవనాన్ని విక్రయించేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో దీప మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ ఆడియోను విడుదల చేశారు.  

ఎన్నో మధుర జ్ఞాపకాలు... 
పోయేస్‌ గార్డెన్‌ నివాసం తమ పూర్వీకుల ఆస్తి అని, ఈ ఇంట్లోనే చిన్నప్పుడు తాను, దీపక్‌ పెరిగినట్టు దీప గుర్తు చేశారు. మేనత్త జయలలిత, తన తండ్రి జయకుమార్‌ ఆ ఇంట్లోనే ఎక్కువ కాలం ఉన్నారని, తాను జన్మించింది కూడా ఇదే భవనంలో అని వివరించారు. అభిప్రా య భేదాలతో తన తండ్రి ఆ ఇంట్లో నుంచి టీ నగర్‌లోని మరో పూర్వీకుల ఇంటికి వచ్చేశారని, అయినా, అత్త పిలిచినప్పుడల్లా పోయేస్‌గార్డెన్‌కు వెళ్లి వచ్చేవారిమని తెలిపా రు. పూర్తిగా ఆమె రాజకీయాల్లోకి వెళ్లడంతో తాము బయటకు వచ్చేశామని, అయితే, ఇది తమ ఆస్తి కావడంతోనే కోర్టులో న్యాయం దక్కిందని పేర్కొన్నారు.

జయలలిత సీఎంగా ఉన్నంత కాలం, ఆమె వెన్నంటి నడిచిన వాళ్లు, పయనించిన వాళ్లు ఎందరో ఉన్నారని, వారందరూ రక్త సంబంధీకులు కాలేరని వ్యాఖ్యలు చేశారు. ఇది చిన్నమ్మ శశికళ కుటుంబానికి సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ భవనం తమ కుటుంబ ఆస్తి అని, దీనిని విక్రయింబోమని స్పష్టం చేశారు. ఈ ఇంటిని అమ్మేస్తామని తాము ఎవ్వరికీ చెప్పలేదని,  ఎవరిని సంప్రదించ లేదని తేల్చి చెప్పా రు. వదంతులను నమ్మ వద్దని,  వేద నిలయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనతో పాటుగా దీపక్‌పై ఉందన్నారు. మరికొద్ది రోజుల్లో  ఆ ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు