వైరల్‌ వీడియో: పాపం.. మృత్యువు ఇలా వస్తుందని ఊహించి ఉండరు

5 May, 2022 11:23 IST|Sakshi

మనిషి ప్రాణాలు.. గాల్లో దీపంలాగా మారిన రోజులివి. అలాంటి ఘటన గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. జేసీడీ టైర్‌లో గాలి నింపుతుండగా.. అది పేలి ఇద్దరు మరణించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. 

కూలీలు ఇద్దరూ జేసీబీకి చెందిన భారీ టైర్‌లో గాలి నింపుతుండగా.. దానిని మరో వ్యక్తి వచ్చి పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరూ చెల్లచెదురై పడిపోయారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.  

గాయపడిన ఈ ఇద్దరిని మధ్యప్రదేశ్‌ రేవా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ జిల్లాలో సిల్తారా ఇండస్ట్రీయల్‌ ఏరియాలో మే 3వ తేదీన ఈ ఘటన జరిగింది.

మరిన్ని వార్తలు