ప్రయోగాత్మకంగా ప్రారంభం.. పురుషుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యకేంద్రాలు

10 Jul, 2022 11:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

త్వరలో 2 చోట్ల ఏర్పాటు

శివాజీనగర(బెంగళూరు): అనారోగ్యాలతో బాధపడే పురుషులకు వైద్య పరీక్షల కోసం త్వరలోనే మల్లేశ్వరంలో, రామనగర జిల్లాసుపత్రిలో ఆరోగ్య కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఆరంభించనున్నట్లు మంత్రి సీ.ఎన్‌.అశ్వత్థ్‌నారాయణ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ పురుషులు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, అయితే వీరిలో ఎక్కువమంది ఆసుపత్రికి రావటం లేదు. ఈ సమస్యను అధిగమించేలా వారి కోసమే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

దీనికి  లభించే స్పందనను బట్టి మునుముందు రోజుల్లో అన్నిచోట్లకు విస్తరించే ఆలోచన ఉందన్నారు. మధుమేహం, క్యాన్సర్, నరాల వ్యాధులు పురుషులను ఎక్కువగా పీడిస్తున్నాయని తెలిపారు. వీటికి తోడుగా ఒత్తిడి జీవితం, మద్యం, పొగ, అశాస్త్రీయ ఆహార సేవనం తదితరాలు పురుషులకు పెను ముప్పుగా మారాయన్నారు. ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 

చదవండి: వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి..

మరిన్ని వార్తలు