కేరళ మంత్రి రాజీనామా

14 Apr, 2021 13:47 IST|Sakshi

తిరువనంతపురం: లోకాయుక్త నుంచి నెపోటిజం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొన్న కేరళ ఉన్నత విద్యా మంత్రి కేటీ జలీల్‌ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. అనంతరం అది గవర్నర్‌ను చేరగా, గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ దాన్ని ఆమోదించారని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది.  తన రక్తం తాగుతున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు సంతోషంగా ఉండి ఉంటారంటూ జలీల్‌ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రెండేళ్ల పాటు మీడియా దాడికి గురయ్యాయనని పేర్కొన్నారు.

చదవండి: బీజేపీ నేతలపై ఈసీ వేటు

మరిన్ని వార్తలు