Kerala Painter: ఏమా అదృష్టం.. పెయింటర్‌ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్‌ కొన్న గంటల్లోనే

17 Jan, 2022 11:37 IST|Sakshi

కొట్టాయం (కేరళ): యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్‌... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆదివారం అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్‌కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్‌– నూతన సంవత్సరపు బంపర్‌ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు.

దానికి కొద్ది గంటలకు ముందు సదానందన్‌ ‘ఎక్స్‌జి 218582’ నంబర్‌ లాటరీ టికెట్‌ కొన్నారు. అట్నుంటే బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశారు. డ్రా తీశాక ఫలితాలను చెక్‌ చేసుకుంటే సదానందన్‌ టికెట్‌కు రూ. 12 కోట్లు తగిలింది. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్‌ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్‌ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు.   
(చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..)

మరిన్ని వార్తలు