అలా వెళ్లి.. ఇలా రూ. 2.5 కోట్లు గెల్చుకున్నాడు

8 Nov, 2023 16:49 IST|Sakshi

 నాలుగే నాలుగు గంటల్లో  కోటీశ్వరుడు

చండీగఢ్‌: ఎప్పటికైనా లాటరీ తగలకపోతుందా  అనే ఆశతో లాటరీ టికెట్‌ కొంటూ ఉంటారు చాలామంది.  ఆ తరువాత దానిసంగతి మర్చిపోతూ ఉంటారు కూడా. కానీ ఇలా లాటరీ కొన్నాడో లేదో అలా జాక్‌పాట్‌ వరించింది ఒక పెద్దాయన్ను. పంజాబ్‌లో  ఈ సంఘటన జరిగింది. 

 పంజాబ్‌లోని హోషియార్పూర్‌లోని మ‌హిల్పూర్ న‌గ‌రంలో నివ‌సించే శీత‌ల్ సింగ్‌ని ఆ అదృష్టం వరించింది. ఇంట్లోని  వారి కోసం మెడిసిన్‌ కొనడానికి దుకాణానికి వెళ్లాడు.  స్తూ వస్తూ ఒక లాట‌రీ టికెట్ కూడా కొని జేబులో వేసుకున్నాడు. బహుశా అంత తొందరగా లక్ష్మీదేవి తన ఇంటికి నడిచి వస్తుందని అస్సలు ఊహించ ఉండడు. ఇలా ఇంటికి వెళ్లాడో  లేదో రూ. 2.5 కోట్ల లాటరీని మొదటి బహుమతిగా గెల్చుకున్నారంటూ సమాచారం అందిందింది. టికెట్‌ కొన్న దాదాపు నాలుగు గంటల తర్వాత తనకు రూ. 2.5 కోట్లు గెలుచుకున్నట్లు లాటరీ నిర్వాహకుల నుంచి కాల్‌ వచ్చిందంటూ సంతోషంతో  ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలనేది కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ  చెప్పాడు బోసి నవ్వులతో శీతల్‌ సింగ్‌.

వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకునే సింగ్ ఇద్ద‌రు పిల్ల‌ల‌. వారు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా, తాను  పదిహేనేళ్ల నుంచి  లాట‌రీ టికెట్లు  వ్యాపారంలో ఉన్నానని  లాటరీ టికెట్ల దుకాణదారుడు  చెప్పాడు.   ఇప్పటివరకు తన దగ్గర  టికెట్లు కొన్నవారిలో ముగ్గురు కోట్ల రూపాయల  ప్రైజ్ మ‌నీ గెల్చుకున్నారని  తెలిపాడు. 

మరిన్ని వార్తలు