వీడియో: నదీస్నానంలో భార్యకు ముద్దు.. బయటకు లాగి చితకబాదిన జనం

23 Jun, 2022 07:26 IST|Sakshi

లక్నో: పవిత్ర నదీస్నానంలో భార్యకు ముద్దు పెట్టాడంటూ ఓ వ్యక్తిని తిడుతూ.. చితకబాదారు ఉత్తర ప్రదేశ్‌ అయోధ్యలో. సరయూ నదిలో ఓ జంట నీళ్లలోకి దిగగా.. భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఈ వ్యవహారాన్ని అక్కడున్న వ్యక్తులు రికార్డు చేయగా.. కొందరు అతన్ని బయటకు లాగేసి చెయ్యి చేసుకున్నారు. 

ఇది పవిత్రమైన నేల. అయోధ్యలో ఇలాంటి పనులు సహించం అంటూ రామ భక్తుడిగా ఓ వ్యక్తి మాట్లాడడం ఆ వీడియోలో చూడొచ్చు. ఘటన ఎప్పుడు జరిగిందన్నది స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో వైరల్‌ కావడంతో.. పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు