ayodhya: రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం

7 Dec, 2023 10:57 IST|Sakshi

రాబోయే సంవత్సరం జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా ఎంపిక అయిన అర్చక అభ్యర్థులు బుధవారం ట్రస్టు కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరికీ నేటి నుంచి అంటే గురువారం నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.

ఈ ఆరు నెలల శిక్షణలో అర్హత సాధించిన అభ్యర్థులకు శ్రీరామ జన్మభూమి ఆలయంతో పాటు ఇతర దేవాలయాలలో అర్చకులుగా నియమించనున్నారు. మరోవైపు శిక్షణ కార్యక్రమాలకు వచ్చిన అభ్యర్థులు  ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. తమకు  శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరామునికి సేవ చేసే భాగ్యం కలగనుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  శిక్షణ సమయంలో ప్రతి అర్చక అభ్యర్థికి నెలకు రూ. 2,000 ఇవ్వనున్నారు. 

అర్చక శిక్షణకు వచ్చిన అభిషేక్ పాండే మాట్లాడుతూ  శ్రీరాముని ఆరాధనా విధానం, పూజలు మొదలైన వాటిపై తమకు శిక్షణ అందిస్తున్నారన్నారు. కాగా అర్చక అభ్యర్థులకు శిక్షణ సమయంలో అర్హత కలిగిన ఆచార్యుల దగ్గర సమస్త ఆచార వ్యవహారాలు నేర్పించనున్నారు. అయోధ్యలో రామాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు

>
మరిన్ని వార్తలు