ఇప్పటివరకు మీరు చూడని చంద్రుని ఉపరితలం.. వీడియో వైరల్..

24 Aug, 2023 21:17 IST|Sakshi

బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్‌లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది.  

   

దక్షిణ ధృవంపైనే ఎందుకు..?
చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 

'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు.

'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.    

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది.  

ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం..

మరిన్ని వార్తలు