Sakshi News home page

Staircase of the Church: ఆ నిచ్చెనంటే ఎందుకు భయం?

Published Sat, Nov 4 2023 7:38 AM

Sircase of the Church no one has Moved for 273 Years - Sakshi

హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ నిత్యం వార్తల్లో కనిపిస్తోంది. దీంతో చాలామంది ఈ చిన్న దేశం గురించి, అక్కడి పౌరుల గురించి, అంటే యూదుల జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం  ఆ వివరాలతో పాటు ఇక్కడి జెరూసలేంలో ఉన్న ఒక విచిత్రమైన నిచ్చెన గురించి తెలుసుకుందాం. ఆ నిచ్చెన 273 ఏళ్లుగా ఒక్క అంగుళం కూడా పక్కకు కదలలేదట. అందుకే దీని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రపంచంలో ఏదేనా వివాదాస్పద స్థలం గురించి చర్చ జరిగినప్పుడు జెరూసలేం పేరు కూడా వినిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ దీనిని తమ రాజధానిగా చెబుతుండగా, మరోవైపు పాలస్తీనా ఇది తమదేనని వాదిస్తుంటుంది. ఈ నగరం కోసం కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఈ స్థలం ఎందుకు అంత ముఖ్యమైనదనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. నిజానికి ఈ ప్రదేశం నుండే ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలైన క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం స్థాపితమయ్యాయని చెబుతారు.

జెరూసలేం నగరంలో ‘చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్’ అనే క్రైస్తవ చర్చి ఉంది. ఏసుక్రీస్తుకు ఇక్కడే శిలువ వేశారని, తర్వాత ఇక్కడే తిరిగి అవతరించారని క్రైస్తవులు నమ్ముతారు. అయితే ఈ చర్చిలో క్రైస్తవ మతంలోని వివిధ వర్గాల సంప్రదాయరీతులు నడుస్తుంటాయి. క్రైస్తవ మతంలోని ఆరు వర్గాలు సంయుక్తంగా ఈ చర్చిని పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఈ చర్చిలో ఒక ప్రత్యేకమైన నిచ్చెన మెట్లు ఉన్నాయి. ఇవి వివాదాస్పదంగా నిలిచాయని చెబుతారు.

‘ది హోలీ సెపల్చర్ చర్చి’లోని ఒక ప్రాంతంలో 1750 నుంచి ఈ నిచ్చెన ఉంది. ఇప్పటి వరకు ఈ నిచ్చెనను ఒక్క అంగుళం కూడా కదపడానికి ఎవరూ సాహసించలేదు. దీనిని కదిపితే వివిధ వర్గాల మధ్య వివాదం తలెత్తవచ్చనే భావనతో దీనిని ఎవరూ ఇంతవరకూ ముట్టుకోలేదట. నేటికీ చర్చిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టినా ఈ నిచ్చెనను ఈ స్థలం నుంచి కదపకపోవడం విశేషం.
ఇది  కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జెండాలపై యూనియన్‌ జాక్‌ ఎందుకు?

Advertisement
Advertisement