ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు.. 

5 Jul, 2023 13:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై రోడ్డు కుంగిపోయిన సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. 

బుధవారం ఉదయం ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. కనీసం నాలుగు గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై పరుగులు తీశారు. 

వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పెద్దగా ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

అంతకుముందు మే 3న ఢిల్లీ ఖురేజీ ఖాస్ కేవ్స్ వద్ద, మార్చి 31న ప్రెస్ ఎన్ క్లేవ్ రహదారిపై హౌజ్ రాణి రెడ్ లైట్ ప్రాంతం వద్ద కూడా ఇదేవిధంగా రోడ్లు కుంగిపోయిన సంఘటనలు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోనే మూడుసార్లు రోడ్లు కుంగిపోయిన సంఘటనలు ఢిల్లీ అధికారులను కలవర పెడుతున్నాయి. 

ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్‌ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..  


 

>
మరిన్ని వార్తలు