హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్తత

17 Nov, 2023 10:25 IST|Sakshi

చండీగఢ్‌: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిల్లలు జరిపిన రాళ్ల దాడుల్లో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత జులైలో నూహ్‌లో రెండు వర్గాల మధ్య ఆందోళనలు జరిగిన తర్వాత తాజా ఘటన ఆందోళన కలిగిస్తోంది.

నూహ్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మహిళలు వెళ్తుండగా.. పిల్లలు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి 8:20 సమయంలో జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. ఆందోళనలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. 

ఈ ఏడాది జులై 31న నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ యాత్ర చేపట్టిన నేపథ్యంలో అల్లరిమూకలు రాళ్లు విసిరారు. దీంతో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనలు పక్కనే ఉన్న గురుగ్రామ్, ఢిల్లీ ప్రాంతాలకు వ్యాపించాయి.  

ఇదీ చదవండి:  కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు!


 

మరిన్ని వార్తలు