Pan - Aadhaar Link: పాన్‌ కార్డు హోల్డర్లకు హెచ్చరిక!

27 Aug, 2021 16:30 IST|Sakshi

మీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఇంకా మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేగాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్‌ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అంటే మీరు వచ్చే నెల చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. 

గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. ఇప్పుడు మరోసారి పొడగించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ముందే మీరు లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి.(చదవండి: పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయ‌డం ఎలా..?)

మరిన్ని వార్తలు