పెన్షనర్లకు ఊరట : కీలక ఉత్తర్వులు

25 Nov, 2020 15:42 IST|Sakshi

 2021 ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికేట్  సబ్‌మిట్‌ గడువు పెంపు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులకు ఊరట. కేంద్ర పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును మరో రెండు నెలలు పెంచుతూ కేంద్రప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ గడువును పెంచాలన్న పెన్షన్‌దారుల సంఘాల విజ్ఞప్తి మేరకు  2021 ఫిబ్రవరి 28 వరకు పెంచుతూ కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లైఫ్ సర్టిఫికేట్ గడువును మరికొంత కాలం పెంచాలంటూ వివిధ పెన్షన్‌దారుల సంఘాల నుంచి పిటిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖకు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని  భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్-19 కేసులు వరకు పెరుగుతున్న నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదించిన  పిదప ఈ గడువును 2021 ఫిబ్రవరి 28 వరకు పెంచినట్టు తెలిపారు. అలాగే పొడిగించిన కాలంలో,  (ఫిబ్రవరి వరకు) ప్రతీ నెలా పెన్షన్ యథావిధిగా చెల్లిస్తామని పేర్కొన్నారు. వాయిదా ప్రధాన లక్ష్యం వివిధ శాఖల వద్ద విపరీతమైన రద్దీని నివారించడమనీ, సంబంధిత  శాఖలలో సరైన పారిశుద్ధ్యం, సామాజిక దూరాన్ని పాటించాలని నోటీసులో పేర్కొంది. కాగా  ప్రతీ ఏడాది పింఛనుదారులు నవంబర్‌లోగా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంది. కరోనా ప్రభావం వృద్ధులపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన మేరకు కేంద్ర పెన్షన్ వెల్ఫేర్ శాఖ లైఫ్ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌ చేసే చివరి తేదీని 2020 డిసెంబర్ 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు