పెట్రోల్‌ ధరలు.. రూ. 18 పెంచి 8 తగ్గిస్తారా? కేంద్రపై ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శలు

22 May, 2022 12:25 IST|Sakshi

పెట్రోల్, డీజీల్‌ ధరల ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే 

ముంబై: పెట్రోల్, డీజీల్‌పై కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకం ఏమాత్రం సరిపోదని, ఇంధన ధరలను అరికట్టేందుకు మరిన్న చర్యలు అవసరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. గత ఆరేడేళ్ల క్రితం పెట్రోల్, డీజీల్‌ ధరలు ఎంతెంతున్నాయో ఆమేరకు కేంద్రం తగ్గించాలని ఠాక్రే శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

రెండు నెలల క్రితం కేంద్రం పెట్రోల్‌ ధరను లీటర్‌కు రూ.18.42 పెంచిందని, కానీ, ఈరోజు కేవలం రూ.8 తగ్గించిందని, అదేవిధంగా డీజీల్‌ ధర లీటర్‌కు రూ.18.24 పెంచింది, ఇప్పుడు కేవలం రూ.6లు తగ్గించిందని కాబట్టి ఇదేమంత భారీ తగ్గింపు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఆరేళ్ల క్రితం పెట్రోలు, డీజీల్‌ ధరలు ఎంతెంత ఉన్నాయో ఆ మేరకు తగ్గిస్తేనే భారీ ఎత్తున తగ్గించినట్లని, వినియోగదారులకూ గొప్ప రిలీఫ్‌ అని ఆయన పేర్కొన్నారు.
చదవండి: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించిన కేంద్రం.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమన్నారంటే  

రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలి 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజీల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు పెద్ద రిలీఫ్‌ ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో కూడా ఉద్ధవ్‌ ఠాక్రే ఆధ్వర్యంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని అసెంబ్లీలో విపక్షనేత, బీజేపీ సీనియర్‌ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సోషల్‌ మీడియా వేదికగా ఈ అంశాన్ని పోస్ట్‌ చేశారు.

శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పెట్రోల్‌పై రూ.8లు, డీజీల్‌పై రూ.6లు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ రాష్ట్రప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పెట్రోల్, డీజీల్‌ లపై వసూలు చేసే ఎక్సైజ్‌ సుంకం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా మహారాష్ట్రలోనే ఎక్కువని, కేంద్రం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎౖMð్సజ్‌సుంకాన్ని తగ్గించాలని ఆయన కోరారు. పెట్రోల్, డీజీల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల పక్షపాతి అని మరోసారి రుజువైందన్నారు.   
చదవండి: ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు మరో షాక్‌.. నోటీసులు జారీ

మరిన్ని వార్తలు