ఆన్‌లైన్‌ చదువు కోసం ఆవు అమ్మకం

24 Jul, 2020 03:31 IST|Sakshi

రూ.6వేలకుఅమ్మేసి పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చిన తల్లిదండ్రులు

పాలంపూర్‌: తమ ఇద్దరు పిల్లల ఆన్‌లైన్‌ పాఠాల కోసం, కుటుంబానికున్న ఏకైక జీవనాధారమైన ఆవుని రూ.6,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జ్వాలాముఖిలోని గుమ్మర్‌ గ్రామానికి చెందిన కుల్దీప్‌ కుమార్‌కు. కుల్దీప్‌ పిల్లలు అన్నూ నాల్గవ తరగతి, డిప్పు రెండవ తరగతి చదువుతున్నారు. మార్చి నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పాఠశాలలు మూత పడ్డాయి. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం అయ్యాయి.

చదువు కొనసాగించాలంటే స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాల్సిందేనని కుల్దీప్‌పై స్కూల్‌ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది.  ఎవ్వరూ రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో విసిగిపోయిన కుల్దీప్‌ తన బిడ్డల చదువుకోసం తన ఏకైక జీవనాధారమైన ఆవుని ఆరువేల రూపాయలకు అమ్ముకొని, పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ కొనిపెట్టారు. విషయం తెల్సి జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్‌ దావ్లా విస్మయం వ్యక్తంచేశారు. తక్షణమే కుల్దీప్‌కి ఆర్థిక సాయం చేయాల్ సిందిగా స్థానిక బీడీఓ, తహసీల్దార్లను ఆదేశించారు.

మరిన్ని వార్తలు