పాన్‌ మసాలా ప్యాకెట్లలో 32 లక్షల యూఎస్‌ డాలర్లు, కంగుతిన్న అధికారులు

9 Jan, 2023 15:00 IST|Sakshi

ఒక వ్యక్తి ఎయిర్‌ పోర్ట్‌లో వందలకొద్ది పాన్‌మసాలా ప్యాకేట్లతో పట్టుబడినట్లు కోల్‌కత్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. వాటిలో ఏకంగా రూ 32 లక్షల విలువ చేసే యూఎస్‌ కరెన్సీని ప్యాక్‌ చేసి తరలించేందుకు యత్నించాడు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులు కోల్‌కతా కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కి సమాచారం అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన కస్టమస్స్‌ అధికారులు నిందితుడు పాన్‌మసాలా ప్యాకెట్‌లలో యూఎస్‌ కరెన్సీని తరలించే విధానం చూసి కంగుతిన్నారు.

సుమారు రూ. 32 లక్షల విలువ చేసే యూఎస్‌ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తామ తనిఖీలు చేస్తున్నప్పుడు వందలకొద్ది పాన్‌ మసాల ప్యాకెట్లు చూసి ఆశ్యర్యపోయాం అన్నారు. ఆ పాన్‌ ప్యాకెట్లలో ఒక పారదర్శక కవర్‌లో ఒక జతన యూఎస్‌ కరెన్సీ దానితో పాటు పాన్‌ పౌడర్‌ పెట్టి ప్యాక్‌ చేశారు. ఒక పెద్ద ట్రాలీ లగేజ్‌లో నిండా ఈ మసాల ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు.
(చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్‌..ఏకంగా ఓ కేసునే టేకప్‌ చేస్తోంది)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు