హృదయవిదారక ఘటన ..తల్లి శవాన్ని భుజాలపై మోస్తూ..

6 Jan, 2023 14:11 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌లో జల్‌పాయ్‌గురిజిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌కి సరిపడా డబ్బులు లేకపోవడంతో తండ్రి కొడుకలిద్దరు మహిళ మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లారు. ఈ ఘటన చూపురులను కంటితడి పెట్టించింది. వివరాల్లోకెళ్తే..రామ్‌ ప్రసాద్‌ దేవాన్‌ అనే వ్యక్తి 72 ఏళ్ల తల్లికి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆమెను జల్‌పాయ్‌గుడి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి బుధవారం తీసుకువెళ్లారు. ఐతే ఆమె గురవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచింది.

ఐతే ఆస్పత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌ మాములుగా సుమారు రూ. 900లు వసూలు చేస్తోందని, కానీ సదరు అంబులెన్స్‌ ఆపరేటర్‌ మాత్రం దాదాపు రూ. 3000 డిమాండ్‌ చేసినట్లు తెలిపాడు. దీంతో తాను అంత మొత్తం చెల్లించలేక ఇలా భుజాలపై మోసుకెళ్తున్నట్లు దేవాన్‌ వెల్లడించాడు. వారు ఆమెను ఒక బెడ్‌షీట్‌లో చుట్టి తండ్రి కొడుకులిద్దరూ..40 కిలోమీటర్లు దూరంలో ఉన్న తమ ఇంటికి భుజాలపై తీసుకువెళ్తున్నారు.

ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కళ్యాణ్‌ ఖాన్‌ స్పందించి... ఇది చాలా బాధకరమైన ఘటన అని అన్నారు. తాము ఈ విషయంలో తాము క్రమం తప్పకుండా ప్రజలకు తగిని ఏర్పాట్ల చేస్తామని, కానీ వారు మమ్మల్ని సంప్రదించలేదని అన్నారు. బహుశా వారికీ తెలియకపోవచ్చు, ఈ విషయం అందరికీ తెలిసేలా చేయాలన్నారు. ఐతే కొంతసమయానికి దేవాన్‌కి ఒక స్వచ్ఛంద సామాజిక సంస్థ వాహనాన్ని అందించిందని, క్రాంతిబ్లాక్‌లోని తన ఇంటికి ఉచితంగా తీసుకువెళ్లినట్లు సమాచారం.

ఐతే స్వచ్ఛంద సామాజిక సంస్థ అదికారులు మాత్రం ఉచిత సేవలు అందించే వారిని అంబులెన్స్‌ ఆపరేటర్లు ఆస్పత్రి వద్దకు రానివ్వరని అన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా అంబులెన్స్‌ అసోసియేషన్‌ తమ సభ్యులు రైలు, రోడ్డు ప్రమాదాలకు ఉచితంగానే అంబులెన్స్‌ సేవలు  అందిస్తున్నామని నొక్కి చెప్పడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

(చదవండి: విమానంలో మూత్ర విసర్జన: వివాదం సెటిల్‌ అవ్వడంతో ఫిర్యాదు చేయలేదు)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు