బీజేపీ నాయకుడి హత్య..ఒకరి అరెస్టు

24 Jan, 2023 21:11 IST|Sakshi

మణిపూర్‌లో బీజేపీ నాయకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లా బీజేపీ నాయకుడు లైష్రామ్‌ రామేశ్వర్‌ సింగ్‌ క్షేత్రి ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద హత్యకు గురయ్యారు. రామేశ్వర్‌ సింగ్‌ తన నివాసంలోని గేట్ల వద్ద విగత జీవిగా పడి ఉన్నట్లు తౌబాల్‌ పోలీసుల హౌబీజం జోగేశ్‌ చంద్ర తెలిపారు. సింగ్‌ నివాసానికి రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ లేని కారులో కొందరు వ్యక్తులు  వచ్చి ఆయనకి అతి సమీపంలో నుంచి ​ కాల్పులు జరిపారని చెప్పారు.

దీంతో 50 ఏళ్ల నాయకుడు రామేశ్వర్‌ సింగ్‌ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు తెలిపారు. వెంటనే అతన్ని ఆస్ప్రతికి తరలించామని కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అనుమానితుడు నౌరెమ్‌ రికీ పాయింటింగ్‌ సింగ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఐతే ఈ హత్యకు ప్రధాన సూత్రదారుడు అయెక్‌పామ్ కేశోర్‌జిత్‌గా గుర్తించినట్లు చెప్పారు. అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ హత్యకు దారితీసిన పరిస్థితులేంటో తెలియాల్సి ఉందన్నారు అధికారులు. రామేశ్వర్‌ సింగ్‌ అధికార బీజేపీలో ఎక్స్‌సర్వీస్‌మెన్‌ విభాగానికి కన్వీనర్‌. మరోవైపు నిందితలును త్వరిత గతిన పట్టుకోని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడ చిదానంద సింగ్‌ అధికారులను కోరారు. 

(చదవండి: శ్రద్ధా హత్య కేసు..చార్జిషీట్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌)

మరిన్ని వార్తలు