ఆధునిక బానిసత్వం.. అసలైన రాజకీయం

25 Mar, 2022 14:23 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!

ఆధునిక బానిసత్వం
ఈ ఆధునిక యుగంలో అఫ్గానిస్తాన్‌లోని పన్నెండేళ్ల బాలిక తన కలలను నిజం చేసుకోవడానికి పాఠశాలకు వెళ్లలేదు; కానీ ఆమెను ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడానికి తాలిబన్లకు మాత్రం కచ్చితమైన స్వేచ్ఛ ఉంది. ఇది ఆధునిక బానిసత్వపు నీచరూపం.
– మిర్వాయిజ్‌ కె.కె., వ్యాఖ్యాత

అసలైన రాజకీయం
రాజకీయ నాయకులు పొద్దున పోట్లాడుతారు, మధ్యాహ్నం కలిసి టీ తాగుతారు... ఇదెలా అని ఆశ్చర్యపోయేవాళ్ల కోసం: రాజకీయాలు అలాగే ఉండాలి. దేశ వ్యవహారాన్ని ఎలా నడపాలి అనే విషయంలో భిన్నాభి ప్రాయాలు ఉండటమే రాజకీయం. అదేమీ యుద్ధం కాదు, కాకూడదు. విభేదించాలి, వ్యతిరేంగా ఓటు వేసుకోవాలి, రాజీ పడాలి.
– హుసేన్‌ హక్కానీ, పాకిస్తాన్‌ మాజీ దౌత్యవేత్త

మునుపటి భారత్‌ కాదు
అక్షరధామ్‌ ఆలయం మీద దాడిచేసి ముప్పై మందిని చంపిన తీవ్రవాదులు ఒక జమ్ము కశ్మీర్‌ మంత్రి ఇంట్లో ఇరవై రోజులు బస చేసి అక్కడి నుంచి వచ్చారని నేను రాసినప్పుడు ఇండియా మౌనంగా ఉంది. మంత్రి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఆయన రాజీనామాను తిరస్కరించారు. ‘ఢిల్లీ’ ఏ ప్రశ్నలూ అడగలేదు. కానీ పద్దెనిమిదేళ్లలో ఇండియా చాలా మారిపోయింది.
– అహ్మద్‌ అలీ ఫయాజ్, స్వతంత్ర పాత్రికేయుడు

తొందరేం లేదు
హిందూ రైటిస్టులవి మొసలి కన్నీళ్లు. వాళ్లకు కావాల్సింది నిజంగా కశ్మీరీ పండితుల గురించిన పట్టింపు కాదు, భారత ముస్లింల మీద ద్వేషం.
– అశోక్‌ స్వైన్, ప్రొఫెసర్‌

ఎంజాయ్‌ చేస్తా!
సీనియర్‌ సిటిజన్లు అందరూ యాత్రలకే వెళ్తారని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎందుకు అనుకుంటున్నారు? నేను దానికి బదులుగా జాజ్‌ క్లబ్‌కు వెళ్తాను; గుండెల్ని మెలితిప్పే సంగీతానికి ఊగులాడుతాను.
– నీరా చండోక్, ప్రొఫెసర్‌

అప్పుడే పరిష్కరించగలం
మీరు ఇప్పుడు (గణిత) ‘సమస్య లను’ పరిష్కరించలేకపోతే , జీవి తంలో చాలా సమస్యలను ఎదుర్కొ ంటారు... నేను మెకానికల్‌ ఇంజినీ రింగ్‌ మూడో ఏడాదిలో ఉన్నప్పుడు మా కాలేజీ ప్రొఫెసర్‌ ఇది చెప్పేవారు.         
– రామ్‌ ప్రకాశ్, ఐఏఎస్‌ అధికారి

చిన్నప్పుడంతే...
చిన్నప్పుడు టీచర్లను ఆఖరికి ‘నీళ్లు తాగొచ్చా’ అని కూడా అడిగేవాళ్ల మని తలుచుకుంటే ఒక్కోసారి నమ్మబుద్ధేయదు. 
– మరియమ్‌ ఫరూఖ్, వ్యాఖ్యాత

అదా సంగతి?
నిజానికి జనానికి ఉండేది ఎత్తులంటే భయం కాదు. పడిపోతామేమో అని భయపడతారు.
– ఇంతియాజ్‌ మహ్‌మూద్, నాస్తికుడు

మరిన్ని వార్తలు