650 మార్కులతో ఆల్‌ ఇండియా ఎస్టీ కేటగిరీలో టాపర్‌

20 Oct, 2020 09:13 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌) ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇప్పటికే ఫస్ట్‌ ర్యాంక్‌ ప్రకటన విషయంలో విమర్శలు వస్తుండగా.. తాజాగా టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్‌ అయినట్లు ప్రకటించినట్లు తెలిసింది. వివరాలు.. 17 ఏళ్ల రావత్ రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 16 న, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఏటీఏ) జారీ చేసిన మొదటి మార్క్‌షీట్‌ ప్రకారం అతడు ఫెయిల్‌ అయినట్లు వచ్చింది. 720 మార్కులకు గాను మృదుల్‌కు 329 పాయింట్లు ఇచ్చింది. దాంతో అతడు రిజల్ట్‌ని సవాలు చేశాడు. ఈ క్రమంలో అతడి ఓఎంఆర్‌ షీట్‌, ఆన్సర్‌ కీని తిరిగి తనిఖీ చేయడంతో 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీలో ఆల్‌ ఇండియా టాపర్‌ అని తేలింది. జనరల్ కేటగిరీలో ఆల్‌ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. (చదవండి: ఎన్నదగిన తీర్పు)

అయితే, ఎన్‌టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌షీట్‌లో కూడా మరో పొరపాటును గుర్తించారు. దాని‌లో, అతని మార్కుల మొత్తం 650 అని చూపించినప్పటికి.. అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది అని రాశారు. అలానే ఫస్ట్‌ ర్యాంకు విషయంలో కూడా విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన సోయబ్‌ అఫ్తాబ్‌, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్‌ ఇద్దరు ఆవుట్‌ ఆఫ్‌ మార్కులు సాధించారు. కానీ ఎన్‌టీఏ టై బ్రేకింగ్‌ పాలసీ ప్రకారం అఫ్తాబ్‌కి మొదటి ర్యాంకు, ఆకాంక్షకు రెండవ ర్యాంకుగా ప్రకటించింది. 

మరిన్ని వార్తలు