Parliament Monsoon Session Day2: పార్లమెంట్‌ ఉభయ సభలు బుధవారానికి వాయిదా

19 Jul, 2022 14:30 IST|Sakshi

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు రెండో రోజు LIVE అప్‌డేట్స్‌

2.00PM
ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల, ధరల పెంపుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ్య రెండూ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి.
11.48AM
► టీఆర్‌ఎస్‌ ఎంపీల ధర్నా

పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీలు ధర్నా చేపట్టారు. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు.

11.29AM
► ఆప్ ఎంపీల నిరసన

ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సింగపూర్‌ పర్యటనకు అనుమతి మంజూరు ఆలస్యాన్ని.. కేంద్రానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ఆప్‌ ఎంపీలు నిరసన చేపట్టారు.


11.17AM
►లోక్‌సభ సైతం వాయిదా

విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అంతకు ముందు రాజ్యసభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది.

11.05AM
► రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా

విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు చైర్మన్‌ వెంకయ్యనాయుడు.

11.03AM
లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ధరల పెరుగుదలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. గందరగోళం నడుమే లోక్‌ సభ కార్యాకలాపాలు నడుస్తున్నాయి.


 
► 
సోమవారం మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్‌ వరకూ కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా తొలి రోజు ఉభయసభల్లో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. 


ఇక రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందే.. గాంధీ విగ్రహం వద్ద రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ భారాలు,అగ్నిపథ్ సహా ప్రజా సమస్యల పై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

► ప్రధాని మోదీ.. మంత్రులతో సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చలు జరిపారు. 

► పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల రెండో రోజు సెషన్స్‌ ప్రారంభమయ్యాయి. తొలి రోజు గందరగోళం నడుమే ఉభయ సభలు వాయిదా పడటంతో రెండో రోజు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

>
మరిన్ని వార్తలు