సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు

10 Oct, 2021 06:08 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్‌ట్యాపింగ్, డేటా లీక్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో  ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని  ఈ–మెయిల్‌ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచి్చనట్లు సైబర్‌ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్‌ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్‌ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు