Mamata Banerjee: గుజరాత్‌ చరిత్ర ఏంటో తెలుసు, దీదీ సవాల్‌

28 Aug, 2021 16:11 IST|Sakshi

తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కొండి : మండిపడిన మమతా బెనర్జీ

దేశాన్ని తెగనమ్మిన బీజేపీ, టీఎంసీపై నిందలేసి ప్రయోజనం లేదు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరా బెనర్జీకి ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో ఆమె కేంద్రంపై మండిపడ్డారు. దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో టీఎంసీని వేలెత్తి చూపినందువల్ల ప్రయోజనం లేదని, అది కేంద్ర పరిధిలోనిదన్నారు.  దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్‌ విసిరారు.

చదవండి :  Coal scam: అభిషేక్‌, భార్య రుజీరాకు ఈడీ సమన్లు

బొగ్గు స్కాం వ్యవహారంలో తమ పార్టీపై దాడిచేయడాన్ని ప్రశ్నించిన మమతా  అది కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నారు. మరి  బొగ్గు గనుల స్వాహాలో  బీజేపీ మంత్రుల సంగతేంటి? బెంగాల్, అసన్సోల్ ప్రాంతంలోని కోల్ బెల్ట్‌ను దోచుకున్న బీజేపీ నాయకుల సంగతేంటని  ప్రశ్నించారు. గుజరాత్‌ చర్రిత ఏంటో  తెలుసు.. తమపై  ఒక కేసు పెడితే, తాము మరిన్ని కేసులను వెలుగులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా  దీదీ హెచ్చరించారు. దీనిపై తిరిగి ఎలా పోరాడాలో తమకు తెలుసని  ఆమె పేర్కొన్నారు.  తమకు వ్యతిరేకంగా ఈడీని ఎందుకు వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు వంటి సహజ వనరుల హక్కుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని మమతా గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు