‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులు ప్రచారానికేనా?

6 Aug, 2022 04:52 IST|Sakshi

న్యూఢిల్లీ:  2016 నుంచి 2019 వరకూ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకానికి విడుదల చేసిన రూ.446.72 కోట్లలో 78 శాతానికి పైగా నిధులను కేవలం మీడియాలో ప్రచారానికే ఖర్చు చేయడం పట్ల పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

బాలికల విద్య కోసం వ్యయం చేయాల్సిన సొమ్మును ప్రకటనలపై వెచ్చించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. మహిళా సాధికారతపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తాజాగా తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. ఈ పథకం అమలు తీరుపై జిల్లా స్థాయిలో ఏదైనా సామాజిక సంస్థ లేదా థర్డ్‌ పార్టీ/నిపుణులతో సోషల్‌ ఆడిట్‌  కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. 

మరిన్ని వార్తలు