స్వచ్ఛందం పేరిట వసూళ్ల దందా

1 Jul, 2022 06:19 IST|Sakshi
ఉదయ్‌పూర్‌లో జరిగిన భారీ ర్యాలీ దృశ్యం

రాజస్తాన్‌ సరిహద్దు జిల్లాల్లో రూ.20 లక్షల వసూలు చేసిన

దావత్‌–ఇ–ఇస్లామ్‌  

ఉదయ్‌పూర్‌: కన్హయ్యాలాల్‌ హత్య కేసులో ప్రధాన నిందితులిద్దరికీ దావత్‌–ఇ–ఇస్లామ్‌ అనే సంస్థతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ సరిహద్దు జైసల్మేర్, బర్మేర్‌ ప్రాంతాల్లో ఉగ్రవాద ప్రచార కార్యక్రమాల కోసం స్థానికుల నుంచి విరాళాలను సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నెల క్రితం సుమారు రూ.20 లక్షలను ఇస్లాం స్వచ్ఛంద సేవాకార్యక్రమాల కోసమంటూ విరాళాలను సేకరించిందని, ఒక రాజకీయ నేత కూడా రూ.2 లక్షలను అందించారని తేల్చాయి. వివరణ కోసం ప్రయత్నించగా ఆ నేత స్పందించడం లేదని తెలిపాయి.

నిందితులు జ్యుడీషియల్‌ కస్టడీకి
ఉదయ్‌పూర్‌లో దర్జీని పొట్టనబెట్టుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ప్రధాన నిందితులైన రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ మొహమ్మద్‌ల ను భారీ బందోబస్తు మధ్య ఉదయ్‌పూర్‌ కోర్టుకు తీసుకువచ్చారు. ఐడెంటిఫికేషన్‌ కోసం కోర్టు వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించింది.  కన్హయ్యాలాల్‌ హత్యను నిరసిస్తూ ఉదయ్‌పూర్‌లో భారీ ర్యాలీ జరిగింది.ఉదయ్‌పూర్‌లోని కన్హయ్యాలాల్‌  ఇంటికి సీఎం సీఎం అశోక్‌ గహ్లోత్‌ వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు..  
 

మరిన్ని వార్తలు