కరోనాతో ప్రజలకు రూ.13లక్షల కోట్ల నష్టం

7 Mar, 2021 17:34 IST|Sakshi

కరోనా మహమ్మారి సామాన్యుల, మధ్య తరగతి కుటుంబ ఆదాయాలపై భారీ ప్రభావం చూపింది. దీనివల్ల కలిగే పరిమాణాలు 2021లో కూడా ఉండే అవకాశం ఉన్నట్లు ఒక నివేదిక పేర్కొంది. ప్రధానంగా కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లోని ఆదాయం రూ.13 లక్షల కోట్లు తుడుచు పెట్టుకపోయినట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ఉద్యోగాల కోత వల్ల ఎక్కువ ప్రభావం పడినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండో, మూడో త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకోవడం ఆశ్చర్యం కలిగించినట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఆర్థికవేత్తలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కుటుంబ ఆదాయాలు తగ్గాయని, దీని ప్రభావం ప్రజల వినియోగ సామర్థ్యంపై 2021 జూన్ వరకు కనిపిస్తుందని తెలిపారు. 2020 జూన్ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 23.9 శాతానికి పతనం కాగా, రెండో త్రైమాసికంలో జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి) క్షీణత 7.5 శాతానికి పరిమితమైందని తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.
 
రెండో, మూడో త్రైమాసికంలో వృద్ధి కనిపించడంతో భవిష్యత్ లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు యూబీఎస్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం మార్కెట్లో నగదు వినియోగం, పెట్టుబడులు అనూహ్యంగా పెరిగాయని దీంతో వృద్ధి పునరుద్ధరణ కనిపించిందని వెల్లడించింది. ఇందులో చాలా వరకు లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులేనని తెలిపింది. మరోవైపు తక్కువ వడ్డీకి గృహ రుణాలు లభించడం, ప్రోత్సాహకాలు, లాక్‌డౌన్ అనంతరం ఒక్కసారిగా రియాల్టీ వంటి రంగాలు పుంజుకోవడం దేశ వృద్ధికి చోదకాలుగా మారాయని తెలిపింది. 

చదవండి:

తొలి ట్వీట్‌ ఖరీదు రూ.18.30 కోట్లు!

ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు