Parliament Monsoon Session 2021: లైవ్‌ అప్‌డేట్స్‌

9 Aug, 2021 17:44 IST|Sakshi

► పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు.
ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.

విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు ఆమోదం
► లోక్‌సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగ సవరణ (ఎస్టీ) బిల్లు, ది డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌ (సవరణ) బిల్లు, ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ (సవరణ) బిల్లు ఆమోదం పొందాయి.

 పెగాసస్‌పై విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ‍్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

లోక్‌సభలో ఓబీసీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఓబీసీ బిల్లుకు 15 విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. హడావుడిగా ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. నేడు పార్లమెంట్‌ ముందుకు ఓబీసీ బిల్లు రానుంది. బిల్లుకు మద్దతిస్తామని 15 విపక్ష పార్టీలు తెలిపాయి.

నీరజ్ చోప్రాకు పార్లమెంట్ అభినందనలు తెలిపింది. స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు  ఉభయ సభల సభ్యులు అభినందించారు.

► లోక్‌సభలో పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టు పట్టాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ ఉదయం 11.30 గంటల వరకు వాయిదా పడింది.

15వ రోజు పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఈ వారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. గత మూడు వారాల్లో 10 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండా బిల్లులు ఆమోదించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ప్రతిష్టంభనకు విపక్షాలే కారణమని అధికారపక్షం ఆరోపణలు చేస్తోంది. నేడు పార్లమెంట్‌లో మరో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం చేసింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీస్‌ ఇచ్చింది. ఎంపీ చింతా అనురాధ లోక్‌సభలో వాయిదా తీర్మానం అందజేశారు.

 

మరిన్ని వార్తలు