సుశాంత్ కేసు : మరో వివాదం

3 Aug, 2020 08:56 IST|Sakshi

పట్నా సీనియర్ అధికారి బలవంతపు క్వారంటైన్

సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే రాజకీయ టర్న్ తీసుకున్న సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం చోటు చేసుకుంది.  ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ముంబై వచ్చిన బిహార్ సీనియర్ పోలీసు అధికారి వినయ్ తివారీని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కు తరలించారు.  నిబంధనలు పేరుతో ఆయనను 14 రోజుల పాటు క్వారంటైన్ చేయడం చర్చకు దారి తీసింది. (సుశాంత్‌ మృతి: రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం)

సుశాంత్ కేసు దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఐపీస్ అధికారి వినయ్ తివారీనీ బీఎంసీ అధికారులు ఆదివారం రాత్రి బలవంతంగా క్వారంటైన్ చేశారంటూ  బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్వీట్ చేశారు. తివారీకి  వసతి కల్పించాలని తాము కోరినా, అతని చేతికి క్వారంటైన్ స్టాంపు వేసి క్వారంటైన్ చేశారని డీజీపీ ఆరోపించారు. (సుశాంత్‌ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్‌ )
  
కాగా సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ  సుశాంత్ తండ్రి కేకే సింగ్  కేసు నమోదు చేశారు. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కోల్డ్ వార్ కి దారితీసింది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇప్పటివరకు రియా చక్రవర్తితోపాటు దాదాపు 40 మంది వాంగ్మూలాలను రికార్డు చేశారు. ముఖ్యంగా రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు, అతని కుక్, చిత్రనిర్మాత మహేష్ భట్, సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్, దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారు. 

మరిన్ని వార్తలు