ఈ చిలుక‌ను ప‌ట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్‌’

6 May, 2022 15:38 IST|Sakshi

చాలా మందికి పెంపెడు జంతువులు అంటే ప్రాణం. వాటిని ఇంట్లో పెంచుకోవడానికి తెగ ఇష్టపడతారు. వాటికి ఏలోటు రాకుండా మనుషులతో సమానంగా చూసుకుంటారు. ఎక్కువగా కుక్కలు, పిల్లలు, కొంతమంది చిలుకలు కూడా పెంచుకుంటారు. పెంపుడు జంతువులు కూడా తమ యజమానులపై ఎనలేని ప్రేమను చూపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబం తాము ప్రేమగా పెంచుకుంటున్న చిలుక కనిపించకపోవడంతో ఊరంతా గోడలపై పోస్టర్లు అతికించారు. అంతేగాక చిలుకను పట్టించిన వారికి క్యాష్‌ రివార్డ్‌ కూడా ప్రకటించారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

గయాకు చెందిన శామ్‌దేవ్‌ గుప్తా, సంగీత గుప్తా పిప్పరపాటి రోడ్డులో నివసిస్తున్నారు. వీరు గత 12 ఏళ్లుగా ‘పోపో’ అనే చిలుకను పెంచుకుంటున్నారు. అ క్రమంలో గత నెల ఏప్రిల్‌ 5న ఆ చిలుక తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిలుక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్ల ద‌గ్గ‌రికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాష‌లో పిలుస్తున్నామ‌ని, అయినా అది దొర‌క‌డం లేద‌ని వాపోయారు.

ఎవ్వ‌రికీ అయినా కనిపిస్తే త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరుతున్నారు. చిలుకను ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరమితం కాలేదు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తన పక్షిని తీసుకెళ్తే దయచేసి తమకు అప్పగించాలని కోరారు. వారికి అదనంగా మూడు పక్షలు కొనిస్తానని ఆఫర్‌ ఇచ్చారు. అది కేవలం పక్షి మాత్రమే కాదని తమ కుటుంబంలో ఓ సభ్యడని  తెలిపారు.

మరిన్ని వార్తలు