ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం ప్రారంభించిన ప్రధాని

18 Dec, 2023 13:47 IST|Sakshi

వారణాసి:దేశంలోనే అతిపెద్ద ధాన్య మందిరం స్వర్‌వేద్‌ మహా ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ సోమవారం వారణాసిలో ప్రారంభించారు. ఈ మెడిటేషన్‌ సెంటర్‌ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఖ్యాతికెక్కింది. 20 వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఏడు అంతస్తుల్లో స్వర్‌వేద్‌ మహా ధాన్య మందిరాన్ని నిర్మించారు. 

ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాశీలో గడిపిన ప్రతిక్షణం మరిచిపోలేనిదని చెప్పారు. కాశీ అంటే అభివృద్ధికి పర్యాయపదంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని రెం‍డు రోజుల పర్యటనలో భాగంగా ఆది, సోమ వారాల్లో వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించారు. 

ఇదీచదవండి..‘హలాల్‌ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు