Namo Ghat: కాశీ తమిళ సంగమం ప్రారంభం

18 Dec, 2023 04:37 IST|Sakshi

కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోదీ పచ్చజెండా  

నేడు వారణాసిలో 37 ప్రాజెక్టులు ప్రారంభించనున్న ప్రధాని   

వారణాసి:  త్తరప్రదేశ్‌లోని వారణాసిలోని నమో ఘాట్‌లో కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్‌ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీ వరకూ జరిగే ఈ వేడుకలో తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 1,400 మంది ప్రతినిధులు పాల్గొంటారు. గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మది, సింధూ, కావేరి పేరిట పలు బృందాలుగా కాశీకి తరలిరానున్నారు. వారణాసితోపాటు ప్రయాగ్‌రాజ్, అయోధ్యను వారు సందర్శిస్తారు.

తమిళనాడు, కాశీ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంగమాన్ని మరింత బలోపేతం చేయడమే కాశీ తమిళ సంగమం ప్రధాన లక్ష్యం. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు అందులో పాలుపంచుకుంటున్నాయి. వారణాసి–కన్యాకుమారి మధ్య నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఆయన సోమవారం వారణాసిలో రూ.19,155 కోట్లకు పైగా విలువైన 37 అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రోడ్లు, వంతెనలు, ఆరోగ్యం, విద్య, పోలీసు సంక్షేమం, స్మార్ట్‌ సిటీ, పట్టణాభివృద్ధి, రైల్వే, ఎయిర్‌పోర్టు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.   

అంబులెన్స్‌కు దారిచ్చిన మోదీ కాన్వాయ్‌  
వారణాసిలో ఆదివారం ప్రధాని మోదీ వాహనశ్రేణి ఓ అంబులెన్స్‌కు దారి ఇచి్చంది. నాదేసర్‌ ప్రాంతంలోని కట్టింగ్‌ మెమోరియల్‌ స్కూల్‌ వైపు మోదీ కాన్వాయ్‌ దూసుకెళ్తుండగా దాని వెనుకే హరన్‌ మోగిస్తూ అంబులెన్స్‌ వచి్చంది. దారి కోసం ఎదురు చూస్తోంది. అది గమనించిన మోదీ కాన్వాయ్‌లోని వాహనాలు వేగం తగ్గించుకొని కాస్త పక్కకు వెళ్లాయి. వాటిని దాటుకొని అంబులెన్స్‌ ముందుకెళ్లిపోయింది.

>
మరిన్ని వార్తలు