కేరళ పర్యటన అప్‌డేట్స్‌: వందేభారత్‌, పలు ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ

25 Apr, 2023 12:53 IST|Sakshi

ఢిల్లీ/తిరువనంతపురం: రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత తిరువనంతపురంలో సెమీ హైస్పీడ్‌ రైలుగా పేరున్న  వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. కేరళకు ఇదే తొలి వందేభారత్‌.

తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. పదకొండు జిల్లాలను కవర్‌ చేస్తూ సాగిపోనుంది ఈ వందేభారత్‌ రైలు. ఇక కేరళలో పలుప్రాజెక్టులను ప్రధాని మోదీ ఒక్కొక్కటిగా ప్రారంభించుకుంటూ వెళ్తున్నారు. కేరళ సంప్రదాయ పంచెకట్టులో వేషధారణతో మోదీ అలరించారు. 

తొలుత.. తిరువనంతపురంలో డిజిటల్‌ సైన్స్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. అదే వేదికగా పలు ప్రాజెక్టులను సైతం ప్రారంభించారు. కేరళ ప్రధాని మోదీ పర్యటనలో ఆకట్టుకునే అంశం.. కొచ్చి వాటర్‌ మెట్రో. కొచ్చి చుట్టూరా ఉన్న  పది ఐల్యాండ్‌లను అనుసంధానించేలా.. బ్యాటరీ ఆపరేటెడ్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ బోట్లను నడిపిస్తారు. ఈ ప్రాజెక్టును మోదీ తన చేతుల మీదుగా ప్రారంభిస్తారు.

మరిన్ని వార్తలు