ఇది రైతన్నలను బాగుచేసే బడ్జెట్‌: మోదీ

2 Feb, 2021 01:35 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పల్లెలను, రైతన్నలను ఈ బడ్జెట్‌ తన గుండెల్లో నిలుపుకుందని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, అన్నదాతల ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. వ్యవసాయ మండీల (మార్కెట్ల) సాధికారతే లక్ష్యంగా భారీగా నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ మీడియా ద్వారా మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నా యని తెలిపారు. రైతులకు ఇకపై మరింత సుల భంగా రుణాలు అందుతా యని వెల్లడించారు. సంపద సృష్టి, సంక్షే మాన్ని లక్ష్యంగా పెట్టు కొని బడ్జెట్‌కు రూప కల్పన చేశారని ఉద్ఘాటిం చారు. 2021–22 బడ్జెట్‌ భారతదేశ దృఢ సంక ల్పాన్ని, ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటు తోందని ప్రధాని  మోదీ ప్రశంసించారు. 

కొత్త దశాబ్దికి పటిష్ట పునాది
అసాధారణ పరిస్థితుల మధ్య బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని ప్రధాని మోదీ వివరించారు. సామా న్యులపై ప్రభుత్వం మరింత భారం మోప నుందని నిపుణులు అంచనా వేసిన ప్పటికీ బడ్జెట్‌ వివరా లను ప్రకటించిన ఒకటి రెండు గంటల్లోనే పెద్ద ఎత్తున సానుకూల స్పందన వ్యక్తం కావడం మంచి పరిణామం అని అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారత్‌) స్ఫూర్తిని ప్రతి బింబించే ఈ బడ్జెట్‌ కొత్త దశాబ్దం ప్రారంభానికి ఒక పటిష్టమైన పునాది అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, దిగజారిన ఆర్థిక వ్యవస్థ వంటి ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ ప్రపంచానికి నూతన విశ్వాసాన్ని అందించిందని అన్నారు. 

ప్రజల జీవనం.. సులభతరం 
ప్రగతి కోసం కొత్త అవకాశాలను విస్తరింప జేయడం, యువత కోసం కొత్త అవకాశాల సృష్టి, మానవ వనరులకు కొత్తరూపు ఇవ్వడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతికత వైపు అడు గులు, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టడం అనే కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించినట్లు మోదీ తేల్చిచెప్పారు. ఇది సంపద సృష్టికి, సంక్షేమానికి ఊపునిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ, ఈశాన్యభారత్‌తోపాటు లద్దాఖ్‌పై దృష్టి పెడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని ఈ బడ్జెట్‌ ఆకాంక్షి స్తోందని అన్నారు. కోస్తా తీరప్రాంత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లను బిజినెస్‌ పవర్‌హౌస్‌లుగా మార్చే దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు. నియమ నిబం ధనలను సరళతరం చేయడం ద్వారా ప్రజల జీవనాన్ని ఇంకా సులభతరంగా మార్చడం బడ్జెట్‌ లక్ష్యమని చెప్పారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పెట్టుబ డులు తదితర రంగాల్లో ఇకపై సానుకూల మార్పులు వస్తాయ న్నారు. 

ఆవిష్కరణలపై దృష్టి 
కేంద్ర బడ్జెట్‌లోని పార దర్శకతను నిపుణులు సైతం కొనియాడుతున్నారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలను పెంచడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) బడ్జె ట్‌లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసినట్లు తెలిపారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం యువతకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఆరోగ్యం, పారిశుధ్యం, పౌష్టికాహారం, సురక్షిత తాగునీరు, సమాన అవకాశాలు వంటివి అందక సామాన్య ప్రజలు, మహిళలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, ఇకపై ఆ సమస్య దూరమవుతుందని వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులి వ్వడం, విధానరమైన సంస్కరణలతో కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా ప్రగతి పరుగులు తీస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు