నేను అప్పుడే చెప్పినా..పట్టించుకోలేదు:అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్‌ వైరల్‌ 

27 Oct, 2023 12:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గూఢచర్య ఆరోపణలతో భారత నేవీకి చెందిన ఎనిమిది  మాజీ అధికారులకు  ఖతార్‌ కోర్టు మరణ శిక్ష విధించడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మాజీ నావికాదళ అధికారులు ఇపుడు మరణం అంచున ఉండటం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్‌ చేశారు. (భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!)

ఖతార్‌లో చిక్కుకున్న  నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో  పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు ఒవైసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని గొప్పగా చెప్పుకునే ప్రధాని మోదీ మరణశిక్షను ఎదుర్కొంటున్న మన మాజీ నావికాదళ అధికారులను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు.

కాగా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో  ఎనిమిది మంది భారత  నేవీ మాజీ అధికారులకు ఖతార్‌ కోర్టు మరణ శిక్ష విధించడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులోఘీ ఎనిమిది మంది అధికారులను ఖతార్అదుపులోకి తీసుకుంది. వీరికి ఖతార్‌ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు