నేను డిఫరెంట్‌

11 Mar, 2024 05:53 IST|Sakshi
ప్రమాణస్వీకారం తర్వాత ధన్‌ఖడ్, ముర్ము, మోదీతో ఖన్విల్కర్‌

హామీలిచ్చి మరవడం నా నైజం కాదు: మోదీ

ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం

అభివృద్ధితో బుజ్జగింపు

రాజకీయాలకు తెర: ప్రధాని

ఆజంగఢ్‌: తాను భిన్నమైన వ్యక్తినని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సాధారణంగా రాజకీయ నాయకులు హామీలిచి్చ, వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. నేను మాత్రం అలా కాదు’’ అని స్పష్టం చేశారు. ‘మోదీ భిన్నమైన (డిఫరెంట్‌) మట్టితో రూపొందాడు’ అన్నారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చాయని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని విమర్శించారు.

పథకాలను ప్రకటించి, వాటిని అమలు చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టాయన్నారు. 30–35 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను తాను సమీక్షించానని, అవి పెద్దగా అమల్లోకి రాలేదని తేలిందని వెల్లడించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడం, ఎన్నికల తర్వాత హామీలిచి్చన నాయకులు, ఆ శిలాఫలకాలు కనిపించకుండాపోవడం గతంలో ఒక తంతుగా ఉండేదన్నారు. ఈ విషయంలో తాను విభిన్నమైన వ్యక్తినని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో పర్యటించారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి రూ.42,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ, కడప, హుబ్బళ్లి, బెలగావి, కొల్హాపూర్‌ తదితర విమానాశ్రయాల్లో కొత్త టెరి్మనల్‌ భవనాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో యూపీ కొత్త శిఖరాలకు చేరుకుంటోందని, దాంతో విషం లాంటి బుజ్జగింపు రాజకీయాలు బలహీనపడుతున్నాయని చెప్పారు. బుజ్జగింపు, బంధుప్రీతి రాజకీయాల్లో చాలా ప్రమాదకరమన్నారు.

ప్రాజెక్టులకు ఎన్నికలతో సంబంధం లేదు  
తాను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు రానున్న లోక్‌సభ ఎన్నికలతో సంబంధముందని ఎవరూ భావించొద్దని మోదీ అన్నారు. 2019 ఎన్నికల వేళ తానెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, అవి చాలావరకు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అవినీతిని పరమావధిగా భావించే కుటుంబ పారీ్టలు అధికారంలో ఉంటే అభివృద్ధి జరిగేది కాదన్నారు.

ఈఎఫ్‌టీఏ ఒప్పందంపై హర్షం
యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ)తో వాణిజ్య ఒప్పందంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్‌లో సభ్యదేశాలైన ఐస్‌ల్యాండ్, లీచ్టెన్‌స్టీన్‌ నార్వే, స్విట్జర్లాండ్‌తో భారత్‌ కలిసి పని చేస్తుందని ప్రధాని అన్నారు.

లోక్‌పాల్‌ ప్రమాణస్వీకారం
లోక్‌పాల్‌ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ మాణిక్‌రావ్‌ ఖని్వల్కర్‌ (66) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers