Lok Sabha election 2024: అలవిగాని హామీలు | Sakshi
Sakshi News home page

Lok Sabha election 2024: అలవిగాని హామీలు

Published Tue, Apr 9 2024 5:53 AM

Lok Sabha election 2024: Bizarre maneuvers and promises of candidates at the time of election - Sakshi

ఊరూరా బారు మొదలుకుని బాల్య వివాహాల దాకా...

ఎన్నికల వేళ అభ్యర్థుల విచిత్ర విన్యాసాలు

‘ఊరూరా బారు, బీరు. నెలకు 10 లీటర్ల బ్రాందీ. ఫారిన్‌ విస్కీ సరఫరా’, ‘ఏకంగా చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్పు’, ‘ఒక్కొక్కరి ఖాతాలో ఏటా రూ.కోటి జమ’, ‘బాల్య వివాహాలకు మద్దతు’... ఇవన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు గుప్పిస్తున్న చిత్ర విచిత్రమైన హామీలు! గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలు గుప్పించే సంస్కృతి పెరుగుతోంది. కొందరు అభ్యర్థులు వార్తల్లో నిలిచేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు...  

బీరు, బంగారం, రూ.10 లక్షలు
వనితా రౌత్‌. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా చిమూర్‌వాసి. అఖిల భారతీయ మానవతా పార్టీ అభ్యర్థిగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. గ‘మ్మత్తయిన’ హామీలతో ఫేమస్‌ అయ్యారామె. తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో బీర్లతో బార్‌ ఏర్పాటు చేయిస్తానని, ఎంపీ లాడ్స్‌ నిధులతో విస్కీ, బీర్లు దిగుమతి చేసుకుని మరీ ఓటర్లకు ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించారు. ‘‘నిరుపేదలు ఎంతో కష్టించి పనిచేస్తారు. వారు మద్యం సేవించి సేదదీరుతారు.

కానీ నాణ్యమైన విస్కీ, బీర్లు తాగే స్థోమత లేక దేశీయ లిక్కరే తాగుతుంటారు. అందుకే నాణ్యమైన లిక్కర్‌ దిగుమతి చేసుకుని వారికందించాలని అనుకుంటున్నా’’ అంటూ రౌత్‌ తన హామీలను సమరి్థంచుకుంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే హామీలు గుప్పించారామె. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని తిరుపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.ఎం.õÙక్‌ దావూద్‌ కూడా ఇలాగే ప్రతి కుటుంబానికీ నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీ సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు! పెళ్లి చేసుకునే ప్రతి జంటకు ఏకంగా 10 సవర్ల బంగారం, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలిస్తానని, కుటుంబానికి నెలకు ఏకంగా రూ.25,000 ఇస్తాననీ వాగ్ధానం చేశారు!

చంద్ర యాత్ర
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్‌ మదురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన శరవణన్‌ (33) అనే జర్నలిస్టు ఉచితంగా చంద్రుడిపైకి పంపిస్తానని, మినీ హెలికాప్టర్‌ ఇస్తానని, ఐఫోన్లు పంచిపెడతానని హామీలిచ్చారు. ప్రతి ఓటర్‌ ఖాతాలో ఏకంగా ఏటా రూ.కోటి జమ చేస్తానన్నారు! ఇంటి పనుల్లో సాయానికి గృహిణులకు ఉచిత రోబోలను అందిస్తానని, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్‌ పూల్‌తో కూడిన మూడంతస్తుల భవనం, ప్రతి మహిళకూ వివాహ సమయంలో 100 సవర్ల బంగారం, కుటుంబానికో పడవ, యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.కోటి సాయం చేస్తానని వాగ్ధానం చేశారు. పైగా తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ హిమ పర్వతాన్ని ఏర్పాటు చేయిస్తానన్న హామీ నవ్వులు పూయించింది. అయితే, ‘తమిళనాడులో ప్రబలంగా ఉన్న ఉచిత తాయిలాల సంస్కృతి బారిన పడొద్దంటూ ఓటర్లలో అవగాహన కలి్పంచడమే తన లక్ష్యమని ముక్తాయించారాయన.  

రైతును పెళ్లాడితే..
రైతు కుమారుడిని పెళ్లాడే మహిళకు రూ.2 లక్షల సాయం చేస్తామని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ సీఎం, జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి ఇచి్చన హామీ తెగ వైరలైంది. ‘‘రైతుల అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. అందుకే రైతుల స్వీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ హామీ ఇచ్చాం’’ అన్నారాయన.

బాల్య వివాహాలకు రైట్‌ రైట్‌
2018 రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ అభ్యర్థి శోభా చౌహాన్‌ ఇచ్చిన హామీ చర్చనీయంగా మారింది. ‘‘దెవాసీ సమాజంలో బాల్య వివాహాల సంస్కృతిలో పోలీసుల జోక్యాన్ని నివారిస్తాం. నన్ను గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూస్తాం’’ అని ప్రకటించారు.  

మునుగోడును అమెరికా చేస్తా
తెలంగాణలో 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ ఇచి్చన హామీ కూడా హైలైటే. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని, ఇతర పారీ్టలు 60 నెలల్లో చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారాయన.

ప్రపంచవ్యాప్తంగానూ...
2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ న్యూ గింగ్రిచ్‌ విఫలయత్నం చేశారు. తనను గెలిపిస్తే 2020 కల్లా టికి చంద్రుడిపై శాశ్వత అమెరికా కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారాయన!
► అవే ఎన్నికల్లో వెర్మిన్‌ సుప్రీమ్‌ అనే ఆరి్టస్ట్‌ తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటించారు.
► జింబాబ్వేలో 2018 ఎన్నికలప్పుడు ప్రజలకు ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ జాను–పీఎఫ్‌ పార్టీ హామీనిచి్చంది. అంటే సగటున రోజుకు           ఏకంగా 822 ఇళ్లన్నమాట!


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement