భారత్‌ నుంచి బంగ్లాకు పైప్‌లైన్‌ ద్వారా డీజిల్‌

19 Mar, 2023 03:43 IST|Sakshi

ఆన్‌లైన్‌లో ప్రారంభించిన మోదీ, హసీనా

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు డీజిల్‌ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించారు. భారత్‌–బంగ్లాదేశ్‌ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్‌ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు.

ప్రస్తుతం డీజిల్‌ భారత్‌ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్‌ నుంచి బంగ్లాదేశ్‌కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్‌లైన్‌ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్‌ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు