తెలంగాణకు ప్రధాని మోదీ.. ఈ నెలలోనే.. వివరాలు ఇవే..

8 Jan, 2023 14:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 19న లేదా 20న రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులను మో దీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆయన  ప్రారంభిస్తారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి విజయవాడ మధ్య (కాజీపేట మీదుగా) ఈ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతారు. తర్వాత ఈ రైలును విశాఖపట్నం దాకా విస్తరించనున్నారు. గతంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను మోదీ ప్రారంభించిన నేపథ్యంలో.. తెలుగురాష్ట్రాల మధ్య నడపనున్న ఈ రైలును కూడా ఆయనే ప్రారంభిస్తారని చెబుతున్నారు.  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల సమాచారం.   

చదవండి: (తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ విడుదల) 

మరిన్ని వార్తలు