భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. కశ్మీర్‌లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం

26 Dec, 2022 19:10 IST|Sakshi

శ్రీనగర్‌: నూతన సంవత్సర వేడుకల వేళ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జమ్ముకశ్మీర్‌లోని ఉధంపుర్‌ జిల్లాలో సోమవారం భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బసంత్‌గఢ్‌ ప్రాంతంలో సిలిండర్‌ లాంటి బాక్సులో సుమారు 15 కిలోల ఐఈడీని అమర్చినట్లు గుర్తించామన్నారు. దాంతో పాటు సంఘటనా స్థలం నుంచి 300-400 గ్రాముల ఆర్‌డీఎక్స్‌, 7.62ఎంఎం కార్ట్రిడ్జెస్‌, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

పేలుడు పదార్థాలతో పాటు కోడ్‌ లాంగ్వేజ్‌లో ఉన్న ఓ పత్రం, నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించిన గుర్తులు లభించినట్లు జమ్మూ జోన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు ముకేశ్‌ సింగ్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. బసంత్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇదీ చదవండి: కరోనా ఫోర్త్‌ వేవ్‌ భయాలు.. అక్కడ మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు!

మరిన్ని వార్తలు