స్టార్‌ హీరోపై ట్రోలింగ్‌.. ధీటుగా కౌంటర్‌ ఇచ్చిన నటుడు

8 Nov, 2021 15:11 IST|Sakshi

లక్నో: తన మీద వస్తున్న ట్రోల్సింగ్‌పై బెంగాల్‌ స్టార్‌ హీరో ప్రోసెన్‌జీత్‌ ఛటర్జీ స్పందించారు. ఒక నటుడిగా కాకుండా దేశ పౌరుడిగా ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసినట్లు స్పష్టంచేశారు. ప్రజలకు సేవలు అందించే వారు మరింత భాద్యతయుతంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే ఇలా చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల స్రోసెన్‌జీత్‌ స్వీగ్గీలో ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా.. కానీ యాప్‌ వారు ఫుడ్‌ డెలివరీ చేయకుండానే.. డెలివరీ ఇచ్చినట్లు స్టేటస్‌ పంపించారు. డెలివరీ యాప్‌ ఆర్డర్‌ను అందించడంలో విఫలమైందంటూ ప్రధానమంత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నట్లు ప్రోసెన్‌జిత్‌ లేఖలో పేర్కొన్నాడు. 
చదవండి: స్టార్‌ హీరోపై ట్రోలింగ్‌: ‘స్విగ్గీ వాళ్లు నా డబ్బులు రిటర్న్‌ చేయలేదు’

కాగా ఈ లేఖ రాయడం నటుడిపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా.. ఇదే దొరికిందా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘చాలా పెద్ద సమస్య.. దయచేసి బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి’ అంటూ నటుడిని ట్రోలింగ్‌కు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రోసెన్‌ జీత్‌ స్పందించారు. ‘ప్రజలకు సేవలు అందించే ప్రజలు మరింత భాద్యతయుతంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోనే తాను ప్రధాని నరేంద్రమోదీ, సీఎం మమతాను ట్వీట్‌లో ప్రస్తావించానని తెలిపారు.

‘ఇటీవల కాలంలో అందరూ ఆన్‌లైన్‌ యాప్స్‌పైనే ఆధారపడుతున్నారు. నేను కూడా అంతే.. అయితే కొంతమంది ఎవరైతే యాప్స్‌ ద్వారా ఫుడ్‌, మెడిసిన్‌ అందిస్తున్నారో వారు మరింత భాద్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి సమయానికి మెడిసిన్‌ డెలివరీ అవ్వకుండే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో వంట చేయలేని, గెస్ట్స్‌ వచ్చిన సందర్భాల్లో బయట నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటాం. అలాంటప్పుడు ఫుడ్‌ డెలీవరీ అవ్వకముందే అయినట్లు చూపిస్తే వారి పరిస్థితి ఏంటి. ప్రజలు ఆకలితో అలాగే ఉంటారా?. ఇదంతా ఆహారం కోసం. నేను ఒక నటుడిగా ట్వీట్‌ చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యను ఎవరూ ఎదుర్కోవద్ధనే పౌరునిగా చేశాను.’ అని క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు