పంజాబ్‌: శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు, వీడియోలు వైరల్‌

29 Apr, 2022 16:35 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లోని పాటియాలాలోని కాళీమాత ఆలయం సమీపంలో శుక్రవారం శివసేన కార్యకర్తలు, సిక్కు వర్గాల మధ్య మధ్య ఘర్షణలు చోటుచేసుకుంది. ఒక గ్రూప్‌ వారు మరో గ్రూప్‌పై రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూశారు. పంజాబ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లా నాయకత్వంలో పాటియాలాలో ఆ పార్టీ కార్యకర్తలు ఖలిస్తానీ గ్రూపులకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. 

ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. శివసేన కార్యకర్తలు ఖలిస్తాన్‌ ముర్దాబాద్‌ అంటూ నినాదాలు చేయగా.. వీరికి వ్యతిరేకంగా సిక్కు వర్గాలు కత్తులు చేతిలో పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇరువర్గాలు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు. కత్తులు దూయడంతో పాటియాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హరీశ్ సింగ్లా మాట్లాడుతూ, పంజాబ్‌లో ఖలిస్థానీ గ్రూపులు ఏర్పడటానికి శివసేన అవకాశం ఇవ్వబోదని చెప్పారు. 
చదవండి: వరుడి నిర్వాకం... ఊహించని షాక్‌ ఇ‍చ్చిన వధువు

పాటియాలాలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా  ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పాటియాలాలో ఘర్షణలు జరగడం చాలా దురదృష్టకరమని తాను డీజీపీతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం పాటియాలాలో పరిస్థితులు పునరుద్ధరిరంచినట్లు పేర్కొన్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశరు. పంజాబ్‌లో శాంతి, సామరస్యం కాపాడటం చాలా ముఖ్యమని భగవంత్ మాన్ అన్నారు.

పాటియాలా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ మాట్లాడుతూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. పాటియాలతోపాటు పంజాబ్ ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు తెలిపారు. 

మరిన్ని వార్తలు