దేశంలో కరోనా మరణాలపై ట్విస్ట్‌.. కేంద్రంపై రాహుల్‌ విమర్శలు

17 Apr, 2022 16:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం నిలకడగా ఉంది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్‌ మరణాల సంఖ్య మరోసారి చర్చనీయాంశమైంది. కాగా, తాజాగా కోవిడ్ మ‌ర‌ణాల విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం చెప్పిన లెక్క‌ల్లో తేడా వుందంటూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

దీంతో, కోవిడ్‌ మరణాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై ట్విట్టర్‌ వేదికగా విమ‌ర్శ‌లు చేశారు. ఈ సందర్భంగా ‘ప్ర‌ధాని మోదీ స‌త్యాలు మాట్లాడ‌రు. మాట్లాడేవారిని మాట్లాడ‌నివ్వ‌రు. ఆక్సిజ‌న్ కొర‌త‌తో ఎవ్వ‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని ఇప్ప‌టికీ మోదీ చెబుతుంటారు. కానీ, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్ల 5 ల‌క్ష‌లు కాదు.. 40 ల‌క్ష‌ల మంది కోవిడ్‌తో మృతిచెందారు. ఇది ముందు నుంచీ నేను చెబుతూనే వున్నాను. కోవిడ్ మృతుల కుటుంబాల‌కు 4 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇవ్వాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు