సుప్రీం కోర్టుని ఆశ్రయించిన నళిని

11 Aug, 2022 19:36 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషి నళిని తనను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసుల దోషిగా ఉన్న ఏజీ పేరారివాలన్‌ విడుల చేయాలని సుప్రీం కోర్టు ఆశ్రయించిన నెలరోజుల తర్వాత నళిని తనకు కూడా ఈ కేసు నుంచి ఉపశమనం కావాలంటు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరుకు మే 18న పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేయడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం పొందాడు.

దీంతో ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, రవిచంద్రన్‌లు తమకు కూడా ఉపశమనం కావాలంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. పైగా నళిని 31 ఏళ్లు పైగా జైలు జీవితాన్ని అనుభవించానని కాబట్లి ఇక తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఐతే 2015 నుంచి తమిళనాడు గవర్నర్‌ వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు నళిని తరుపు న్యాయవాది మాట్లాడుతూ...నళిని తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తాము దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్ల పేర్కొన్నారు.

పైగా 2018లోనే తమిళనాడు మంత్రి మండలి రాజీవ్‌ గాంధీ కేసులో దోషులను విడుదల చేయాలని గవర్నర్‌కి సిఫార్సు చేసిందని చెప్పారు. కానీ గవర్నర్‌ నిర్ణయం తీసుకోకుండా ఆ సిఫార్సును రాష్ట్రపతికి పంపించారని అన్నారు. ఐతే పెరారివాలన్‌కి సుప్రీం కోర్టు విడుదల మంజూరు చేసినప్పడూ నళిని, రవిచంద్రన్‌లు కూడా అతని తోపాటు సమానంగా ఈ కేసు నుంచి ఉపశమనం ఇవ్వాలని నళిని తరుఫు న్యాయవాది అన్నారు.

వాస్తవానికి ఇదే కేసులోని మిగిలిన దోషులు నళిని, మురుగన్, సంతన్, రవిచంద్రన్, జయకుమార్, రాబర్ట్ పాయస్‌ల కేసును పరిశీలిస్తామని తమిళనాడు ప్రభుత్వం మే నెలలో పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి, నళిని, రవిచంద్రన్‌లు మాత్రమే విడుదల కోసం సుప్రీం కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే పెరారివాలన్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ పై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్‌ ఆలస్యం చేయడంతో సుప్రీం కోర్టు అతని కేసుని పరిగణలోకి తీసుకుంది. పైగా మంత్రిమండలి సిఫార్సుకి కట్టుబడి ఉంటామంటూ, ఆర్టికల్‌ 142 కింద ప్రత్యేక అధికారాన్ని వినియోగించి ధర్మాసనం పెరారివాలన్‌ని విడుదల చేసింది కాని ఇదే విధానం మిగతా దోషులకు వర్తించకపోవచ్చు.

(చదవండి: నళినికి నెల రోజుల పెరోల్‌)

మరిన్ని వార్తలు