సీఎం షిండేపై బీజేపీ పోస్టర్‌..సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం

24 Nov, 2023 20:49 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండేపై రాజస్థాన్‌ బీజేపీ లీడర్‌ వేసిన పోస్టర్‌ శివసేన ఉద్ధవ్‌ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌కు కోపం తెప్పించింది. రాజస్థాన్‌ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా రాజస్థాన్‌లోని హవామహల్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బాలముకుందాచార్య కార్యకర్తలు షిండేకు ఆహ్వానం పలుకుతూ ఒక పోస్టర్‌ వేశారు. 

హిందూ హృదయ సామ్రాట్‌  షిండే అని పోస్టర్‌పై ఉండడం  పట్ల సంజయ్‌ రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహం కోసం సొంత పార్టీకి మోసం చేసిన వ్యక్తిని బాల్‌ థాక్రేతో సమానంగా కీర్తిస్తారా అని మండిపడ్డారు. అధికారం కోసం సొంత పార్టీని మోసం చేసే వారిని కీర్తించే కొత్త ట్రెండ్‌ స్టార్టయిందని రౌత్‌​ అన్నారు. 

ఈ వివాదంపై మహారాష్ట్ర  మంత్రి సుధీర్‌ మునగంటివార్‌ స్పందించారు. ‘కార్యకర్తలు సాధారణంగా తమ అభిమాన నేతలను వారికిష్టం వచ్చినట్లుగా పిలుచుకుంటారు. ఇందులో భాగంగానే షిండేను అభిమానించే వ్యక్తి ఆ పోస్టర్‌పెట్టుంటారు. షిండే బాల్‌థాక్రే బాటలో వెళ్తున్నారని పోస్టర్‌ వేసిన వాళ్లు భావించి ఉంటారు. షిండే తనకు తానుగా ఆ పోస్టర్‌ అయితే పెట్టలేదుగా’ అని సుధీర్‌ అన్నారు. 

ఇదీచదవండి..డీకే శివకుమార్‌ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు