Rajasthan Elections Survey 2023: సంచలన లోక్‌ పాల్‌ సర్వే

24 Nov, 2023 14:29 IST|Sakshi

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీ పోరు తప్పదని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి. దీనికి తోడు  ప్రతీ ఎన్నికల్లో  అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతున్న పరిస్థతి గత ముప్పయేళ్లుగా కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ సారి బీజేపీకి పట్టం తప్పదనే అంచనాలు  కూడా భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో లోక్‌పాల్‌ తాజాగా కీలక సర్వేను ప్రకటించింది.

సవరించిన తుది సర్వే ఫలితాలు అంటూ ట్విటర్‌ ద్వారా  కీలక నంబర్లను ప్రకటించింది.  అయితే కీలకమైన కరణపూర్‌  నియోజకవర్గాన్ని పరిగణనలోకి  తీసుకోవడం లేదని వెల్లడించింది. సర్వేలో బీజేపీ వైపే మొగ్గు ఉన్నట్టు ఈ సర్వలే తేల్చింది. బీజేపీ 92-98 సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే అధికార పార్టీ కాంగ్రస్‌కు 87-93 మధ్య సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.  ఇతరులు 12 నుంచి 18 సీట్లను దక్కించుకుంటారని తేల్చింది. అయితే దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు కాంగ్రెస్‌ 100 సీట్లు దక్కించుకోవడం ఖాయం అంటూ కమెంట్‌  చేశారు.  (రాజస్థాన్ ఎన్నికలు: కీలక నియోజకవర్గాలు, ఆసక్తికర విషయాలు)

బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో 'జైపూర్ కీ బేటీ' పై చర్చ జోరందుకుంది. జైపూర్ రాజకుటుంబంలో జన్మించి, ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న దియా కుమారిపై భారీ అంచనాలే ఉన్నాయి. రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుమారి ప్రస్తుతం ఎన్నికల్లో  జైపూర్ నగరంలోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
 

కాగా  రాజస్థాన్‌లో 200 నియోజక వర్గాల, నవంబరు 25న పోలింగ్‌ జరగనుంది.డిసెంబరు 3న ఫలితాలు తేలనున్నాయి. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి   గురువారం సాయంత్రంతోతెరపడింది. కాంగ్రెస్ , బీజేపీ  రాష్ట్రవ్యాప్తంగా తమ స్టార్ క్యాంపెయినర్‌లతో ర్యాలీలు, సభలు నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ  లాంటి ప్రముఖులను రంగంలోకి దించగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి  దిగ్గజాలు బీజేపీ ప్రచార పర్వాన్నిముందుండి నడిపించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తన సంక్షేమ పథకాలు, విధానాలు హామీలను ప్రచారంలో హైలైట్‌ చేయగా,  రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగం, మహిళలపై హింస లాంటి ఆరోపణలతో  ముందుకు సాగింది బీజేపీ. హోరా హోరీగా సాగుతున్న ఈఎన్నికల పోరులో   రాజస్థాన్‌ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది  తేలాలంటే డిసెంబరు  3 వరకు వెయిట్‌ చేయక తప్పదు. 

మరిన్ని వార్తలు