సంచరించే ఆత్మ.. జ్వలించే నటన

18 Apr, 2022 16:57 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 

అయివుంటే కనుక..!
ఉత్తర భారతదేశంలోని సిక్కు దేవాలయాల నిర్వహణ బాధ్యత కలిగిన ‘శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ’.. మద్యం మత్తులో గురుద్వారాను సందర్శించినందుకు క్షమాపణ చెప్పాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ని డిమాండ్‌ చేసింది. దేవుడి దయ వల్ల అతడు విశ్వాసం గలిగిన ‘మజాబీ’ సిక్కు గానీ, నిరుపేద హిందువు గానీ కాదు. అయివుంటే కనుక అతడు చేసిన తప్పు జీవితమంతా పశ్చాత్తాపపడినా కూడా క్షమాపణ లభించనంతటిది!                        
– సోనమ్‌ మహాజన్, యాక్టివిస్ట్‌

ధన్యవాదాలు
ఆయన కోల్‌కతాకు చెందిన ఒక సామాజిక కార్యకర్త. అంబేడ్కర్‌ జయంతి రోజు ఆయన తన ప్రసంగంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు జరగవల సిన న్యాయం గురించి ప్రస్తావించారు. ఆయన  ఆ పని చేసినందుకు ఎంతో సంతోషంగా, వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుశాంత్‌ కేసులో సి.బి.ఐ., ఎన్‌. సి.బి., ఇ.డి. మేల్కోవాలి. 
– చైతాలీ ముఖర్జీ, నేషనలిస్ట్‌ 

ఎట్టకేలకు.. చిట్టచివరికి
నేను గత నెలన్నరగా ఆమెను వెంటాడు తున్నాను. కనీసం 11 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడాను... చివరికి ఉప ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు మాత్రమే మమతా బెనర్జీ ఇంటర్వ్యూ సాధించగలిగాను.             
– హిమాద్రీ ఘోష్, ‘ది వైర్‌’ జర్నలిస్ట్‌

సంచరించే ఆత్మ
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి చేర్చుకునే విషయమై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రశాంత్‌ ఎప్పుడూ ఒక దేహం కోసం సంచరిస్తున్న ఆత్మలా ఉంటారు. అయితే ఆ ఆత్మను కాంగ్రెస్‌ అనే దేహం ఆవహించాలను కోవడం పార్టీలోని కొంతమంది నాయకులకు రుచించడం లేదు.
– అనూప్, బ్లాగర్‌

జ్వలించే నటన
దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌ను ఆక్రమిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే వారి ‘బాహుబలి’ చిత్రాలకు అభిముఖంగా నిలబడి పోటీని ఇవ్వగల ఏకైక నటి బాలీవుడ్‌లో ఇప్పుడు ఒక్క కంగనా రనౌత్‌ మాత్రమే. జ్వలించే ఆమె నటన ఎంతో అద్భుతం! ‘ధాకడ్‌’ టీజర్‌ రిలీజ్‌ అయిన నాలుగు రోజుల్లోనే కోటి వీక్షణలు రావడం ఆమె నటనలోని సత్తాను చాటే సంగతే. 
– రాజు జంగిద్, ఎన్‌.ఎఫ్‌.టి. క్రియేటర్‌

కంటికి ఒత్తిడి 
నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా వచ్చిన ‘మాయి’లో సాక్షీ తన్వార్‌  అద్భుతంగా నటించారు. అయితే ఈ ఓటీటీ డైరెక్టర్‌లు కళ్లకు ఒత్తిడి కలిగించే ముదురు వర్ణాలను భావోద్వేగ భరిత సన్నివేశాలకు ఎందుకు అద్దుతారో తెలియదు. 
– ఖుష్‌బూ ఎస్‌., స్క్రీన్‌ లవర్‌

సంరక్షక ప్రధాని
శ్రీ నరేంద్ర మోదీజీ మన ప్రధానమంత్రి మాత్రమే కాదు. ఈ దేశానికి, పౌరులకు సంరక్షకుని లాంటి వారు. పీఎం మోదీ లేత మనసులతో సంభాషించడానికి ఇష్టపడతారు. వారికి జ్ఞాన మార్గ దర్శనం చేస్తారు. ఆయన ‘పరీక్షా పే చర్చా’.. పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి లక్షలాది మంది విద్యార్ధులకు సహాయ పడుతోంది.
– వరుణ్‌ పూరి, ఎం.ఇ.ఎ. సలహా సభ్యులు

మరిన్ని వార్తలు