మళ్లీ మొదలు.. మణిపూర్‌లో టెన్షన్‌ టెన్షన్, ఇప్పటి వరకు 70 మంది మృతి

24 May, 2023 15:19 IST|Sakshi

ఇంఫాల్‌: గిరిజన, గిరిజనేతరుల నడుమ భీకర ఘర్షణలతో మణిపూర్‌ అట్టుడికిపోతోంది. ఇటీవల క్రమంగా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పలు ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ నిబంధనలను కూడా సడలించారు. దీంతో సమస్య సద్దుమణుగుతోందని అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపు తాజాగా మరో సారి అల్లర్ల చెలరేగడంతో మణిపూర్‌ను భయం గుప్పిట్లోకి నెట్టాయి. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో సుమారు 70 మంది మృతి చెందడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

కాగా ఘర్షణల కారణంగా మంగళవారం మణిపూర్‌లో దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. కర్ఫ్యూ  అమలులో ఉండడంతో ప్రజలు ఇంట్లోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. పరిస్థితులు అదుపులో తీసుకొచ్చే క్రమంలో రాష్ట్రమంతటా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో పాటు కొద్ది గంటల సడలింపుతో కర్యూ కొనసాగిస్తున్నారు.

శాంతి భద్రతల కోసం 10 వేల మంది సైనికులను రాష్ట్రమంతటా మోహరించినట్టు ప్రభుత్వం తెలిపింది. సోమవారం జరిగిన హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఎం బిరేన్‌ సింగ్‌ వెల్లడించారు. కాగా మణిపూర్‌లో తమకు షెడ్యూల్డ్‌ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్‌ చేయడం ఈ సమస్యకు అగ్గి రాజేసింది. ఈ దీంతో అక్కడ నివసిస్తున్న గిరిజనులు భగ్గుమనడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

చదవండి: Viral Video: హెల్మట్‌ ధరించి బైక్‌పై రైడ్‌ చేస్తున్న కుక్క

మరిన్ని వార్తలు